Breaking News

యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి

9 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి

ఎన్నో ఒత్తిళ్లకు యోగాతో ఉపశమనం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.

నిజ జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని, యోగాతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు అని రామగుండం పోలీస్ కమిషనర్ గారు తెలియజేశారు. ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం సిపి ముఖ్యఅతిథిగా హాజరై సిబ్బందితో మాట్లాడుతూ…అధికారులకు సిబ్బందికి అందరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఇక్కడున్న సిబ్బంది అందరూ చాలా ఫిట్నెస్ గా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఫిట్నెస్ ని కాపాడుకోవాలి. యోగా అనేది ఒక రోజుతో కాకుండా నిత్యం జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. మనం చేసే ప్రతి పని మన కంట్రోల్ లో ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక యోగ ద్వారా మాత్రమే వస్తుందన్నారు. మనకి మనపై కంట్రోల్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా అధిగమించవచ్చు అన్నారు. భారతదేశ తత్వశాస్త్రం ప్రకారం ఎదుటివారిని జయించే ముందు మనలోని సమస్యలను, బలహీనతలను, భయాలను ముందుగా గెలవాలి అన్నారు. నిత్యం యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటామన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ చెందిన యోగా శిక్షకులతో పోలీస్ కమిషనర్ తో సహా పోలీస్ సిబ్బంది అధికారులు యోగ సాధనాలు చేశారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏ సిపిఎం రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పి సి ఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఆర్ ఐ లు దామోదర్,మల్లేశం, శ్రీనివాస్, వామన మూర్తి, సిసి హరీష్, ఎస్ఐ లు, ఆర్ ఎస్ఐ లు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాల్ ఆర్గనైజేషన్ వాలంటరీ ఓం ప్రకాష్, యోగా శిక్షకురాలు రాధిక మరియు ప్రవీణ్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్