నేడు సోలాపూర్‌కు మంత్రి హరీశ్ రావు
✳️ఆయన వెంట హోంమంత్రి మహమూద్‌అలీ, ఇతర నేతలు
✳️మార్కండేయ రథోత్సవం, త్వరలో జరిగే సభాస్థలి పరిశీలన
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్‌లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథోత్సవంలో రాష్ట్రం తరఫున పలువురు మంత్రులతోపాటు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
