మంచిర్యాల జిల్లా.
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్వర్యంలో టచ్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినొస్తావ వేడుకలు
తేదీ 12-05-2025 సోమవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్ లో సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు . టచ్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు పూల బోకేలు అందజేసి శాలువాలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నర్సులంటే మానవత మూర్తులని వైద్య రంగం లో నర్సుల పాత్ర కీలక మైనదని నిరంతరం రోగులకు సేవలు అందించడం లో అగ్ర భాగాన నిలుస్తారని , వైద్య రంగం లో నర్సులు కనిపించే దేవతలని , సేవ మూర్తులని , కాలిన గాయాలతో దవాఖానకు వచ్చే బాధితులైన , రోడ్ ప్రమాద క్షేత గాత్రులైన , పురిటి నొప్పులతో వచ్చే గర్భిణీలైన మరి ఇంకెవరైనా తోబుట్టువుల మొదట పలకరించేది నర్సులేనని , రోగులే దైవంగా భావించి సేవలందిస్తున్న వైద్య రంగానికే వన్నె తెస్తునన్నది నర్సులేనని వాళ్లు చేస్తున్న సేవలు కొనియాడారు .
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజేల్లి వెంకటయ్య , గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న మరియు కార్యక్రమం ముఖ్య అతిథులు టచ్ హాస్పిటల్ డైరెక్టర్ శేఖర్, డాక్టర్ బిళ్ళ వికాస్ , డాక్టర్ పల్లవి , డాక్టర్ నరేష్ , డాక్టర్ సుమన్, హరీఫ్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
