ప్రాంతీయం

వారంతపు సంతను సద్వినియోగం చేసుకోవాలి

123 Views

– సర్పంచ్ చిత్తారి గౌడ్

దౌల్తాబాద్, సెప్టెంబర్ 13: గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాంతపు సంతను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చిత్తారిగౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి తో కలిసి వారాంతపు సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులేకుండా గ్రామంలోనే గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారంతపు సంతను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి బుధవారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు సంత ఉంటుందని, గ్రామస్తులు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగరాజు గౌడ్, పంచాయతీ కార్యదర్శి కిషోర్ యాదవ్, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు లింగం గౌడ్ తో పాటు వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *