ముస్తాబాద్, ఆగస్టు10 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ముస్తాబాద్ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా ఐదుగురు సభ్యులకు పైచిలుకు సమావేశం ఏర్పరచుకొని మండల కమిటీ ప్రకటించటించారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ ఓబీసీల సంక్షేమాల గురించి అభివృద్ధి కోసం మరెన్నో పథకాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు అంజ గౌడ్. మండల ప్రధాన కార్యదర్శి భాద నరేష్, కరెడ్ల మల్లారెడ్డి, మహేష్ ముదిరాజ్ సత్యం, దారవేణి రాజు, శ్రీనివాస్ చారి, మహేందర్ రెడ్డి మదాసుభూమయ్య తదితరులు పాల్గొన్నారు.
