ప్రాంతీయం

హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ఐ లుగా పదోన్నతి

25 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ఐ లుగా పదోన్నతి.

పదోన్నతితో విధుల పట్ల బాధ్యతలు కూడా పెరుగుతాయి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పదోన్నతులతో విధుల పట్ల మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎఎస్ఐ లుగా పదోన్నతి పొందిన సిబ్బంది నీ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ… పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన ఉత్తమ పోలీస్ సేవలు అందించాలని, పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెరిగే రీతిలో ప్రజలతో వ్యవహరించాలని పోలీస్ కమిషనర్  తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్