ప్రాంతీయం

మాల గురజాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు

30 Views

మంచిర్యాల జిల్లా.

మాల గురజాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు  ఆదేశానుసారం తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాల గురుజాల గ్రామంలో వైద్య శిబిరమును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వైద్య శిబిరంలో 52 మందికి పరీక్షలు చేసి పదిమందికి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఉన్నట్లు గుర్తించి పరీక్షలు చేయడం జరిగినది అదేవిధంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చిన మాదిరిగా ఈ గ్రామంలో ఎలాంటి బయోందనులకు గురి కావలసిన అవసరం లేదు. వైద్య ఆరోగ్యశాఖ తరఫున మూడు రోజులపాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదేవిధంగా నాలుగు వైద్య బృందాలతో గ్రామంలోని 250 ఇండ్లు 912 జనాభ కు పరీక్షలు చేయడం జరుగుతుంది రక్త మూత్ర పరీక్షలను శాంపుల్స్ కలెక్ట్ చేసి టీ హబ్ ద్వారా పరీక్షలు చేయించడం అదేవిధంగా గ్రామంలో రెండు బోర్వెల్ ద్వారా మంచినీరును తీసుకుంటున్నారు. వాటికి కూడా వరంగల్ లాబరేటరీ కి పంపించి పరీక్షలు చేయించడం జరుగుతుంది డాక్టర్ సుధాకర్ నాయక్ ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బెల్లంపల్లి ఆధ్వర్యంలో సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు డాక్టర్ ఏంజలి వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆఫీసర్ మురళి, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు. నిర్వహించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి రిపోర్టును పంపించడం జరుగుతుంది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్