పెద్దపల్లి కాన్స్టెన్సీ.
35 ఏళ్ల నిర్లక్ష్యాన్ని చీల్చిన వంశీకృష్ణ – రూ.140 కోట్లు పెన్షన్ ఫండ్‌కు సాధించారు.
సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత మూడు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ, ఆ తరువాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా, యువ పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ధైర్యంగా రంగంలోకి దిగారు.
ప్రతి మెట్టులో పోరాటం… ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ – వంశీకృష్ణ కేంద్ర మంత్రులను, సింగరేణి అధికారులను కలసి, వారిని ఒత్తిడి చేశారు. పార్లమెంట్‌లో గళమెత్తారు. వినతిపత్రాలు సమర్పించారు. ఈ నిరంతర పోరాట ఫలితంగా – ఇప్పుడే సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతీ టన్నుపై రూ.20 పెన్షన్ ఫండ్‌కి కేటాయించేందుకు అంగీకరించింది. దీని ద్వారా రూ.140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్‌కి చేరుతుంది.
ఈ విజయాన్ని గౌరవిస్తూ, ఎంపీ వంశీకృష్ణ ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు:
“ఇది ఆరంభం మాత్రమే. నా లక్ష్యం – ప్రతి కార్మికుడికి నెలకు ₹10,000 పెన్షన్ అందే వరకు పోరాటం ఆగదు. ఈ ఉద్యమం ఇక ఒక్క వ్యక్తిదేగా కాదు – ఇది లక్షల మంది కార్మికుల ఆకాంక్ష.”
సింగరేణి కార్మికుల పట్ల నిబద్ధతను ఈ విజయంతో మరోసారి నిరూపించుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ కి కార్మిక సంఘాలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.





