ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు నీళ్లతో నిండి ఉన్నందున పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి
మీ పిల్లలు జాగ్రత్త, పిల్లల పై ఓ కన్నేసి ఉంచండి, పిల్లల బాద్యత తల్లిదండ్రులదే
ఈత సరదా విషాదంగా మారకుండా చూసుకోవాలి
పోలీస్ కమిషనర్ బి. అనురాధ, ఐపీఎస్
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16
సిద్దిపేట జిల్లా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులలో, చెరువులలో కుంటలలో, వాగులలో వంకలలో నీళ్లు నిండుగా ఉన్నాయి, సరదా కోసం చెరువులు.. బావులకు వాగులు వంకలలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈత నేర్పించాలని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్లాలని సూచించారు. ఒంటరిగా మరియు ఫ్రెండ్స్ తో పిల్లలను ఈతకు పంపవద్దని తెలిపారు. పిల్లల గురించి తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు.కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందుకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు, స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి. ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి.వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని ఏమైనా కొత్త విషయాలు నేర్పించాలి సూచించారు. తల్లిదండ్రులు వెంబడి తీసుకుని వెళ్లిన పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. పిల్లలకు నీటి లోతు తెలవనందున అందులోకి జారీ చనిపోవడం జరుగుతుందన్నారు.ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు అర్ధాంతంగా చనిపోతే తల్లిదండ్రుల మనోవేదన ఎవ్వరూ తీర్చలేనిదని పేర్కొన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.
