ముస్తాబాద్, జనవరి 25 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లాలోని కొండాపూర్ గ్రామం నందు ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ (ఏఇ) ఫలితాలలో ఉద్యోగం పొందిన కొండాపూర్ గ్రామవాసి మహమ్మద్ రఫీ తండ్రి బహదూర్ అలికి ఈ రోజున ఇస్లామిక్ కమిటీ తరఫున యూత్ తరఫున ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మజీద్ సదర్ నవాబు, మహమ్మద్ జావిద్, మహమ్మద్ యూసుఫ్, మొహమ్మద్ చోటు, మహమ్మద్ అలీ, మహమ్మద్ హకీం మహమ్మద్ ఫరీద్, మహమ్మద్ మహబూబ్, యూత్ సభ్యుల నుండి మహమ్మద్ యూసఫ్, మొహమ్మద్ ఖాలీద్, మొహమ్మద్ హైమధ్, మహమ్మద్, సల్మాన్, మొహమ్మద్ సద్దాం, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంకా యువత ముందుకువెళ్లి ఉన్నత శిఖరాలను అధిరో హించాలని కోరారు.
