ప్రాంతీయం

ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలి

135 Views

 

ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం బాధ్యత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ కే.రామకృష్ణ రెడ్డి, ఆయిల్ ఫామ్ ఫార్మర్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఏండీ సురేందర్ రెడ్డి, జీఏం సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్, ఉద్యానవన శాఖ డీడీ రామలక్ష్మి, వ్యవసాయ అనుబంధ సంస్ధ అధికార సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లాలో నెమ్మదిగా సాగు అవుతున్న ఆయిల్ ఫామ్ పంట వేగం పుంజుకునే అంశాలపై సమీక్షించారు.

నెలలోపు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని వ్యవసాయ అనుబంధ సంస్ధ అధికార వర్గాలకు మంత్రి ఆదేశం.

జిల్లాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులు మీ ఏఈఓ-వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో ఎంతమేర ఉన్నారో.. జాబితా రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశం.

– వ్యవసాయ, ఆయిల్ ఫెడ్, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని మంత్రి సూచన.

ఆయిల్ ఫెడ్ బై బ్యాక్ ఒప్పందం సైతం చేసుకోవడం ఉంటుందని, 10 ఎకరాల విస్తీర్ణం పై ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికార వర్గాలు రైతులకు తెలపాలని మంత్రి ఆదేశం.

నెలలోపు 10వేల ఎకరాలు ప్లాంటేషన్ పూర్తి చేయాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా ప్రయత్నాలు సాగించాలని అధికార వర్గాలకు మంత్రి సూచన.

– ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకుని, ప్రత్యేక శ్రద్ధతో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని రైతుబంధు సమితి నాయకులకు మంత్రి సూచన.

– జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు నెమ్మదిగా జరుగుతున్న దృష్ట్యా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చేపడుతున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు.

– గ్రామాలలో ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి నాయకులు, ఆత్మ కమిటీ, పీఏసీఎస్, ఇతర వ్యవసాయ అనుబంధ సంఘాల ప్రతినిధుల సహకారంతో ఆయిల్ ఫామ్ తోటలు పెంపకం చేపట్టేలా ముందుకు వచ్చేలా రైతులను చైతన్యం చేయాలని మంత్రి సూచన.

– ఏఈఓ, ఏఓలు క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ సాగు స్థితిగతులను గురించి ఆరా తీశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7