ముస్తాబాద్,18 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిల తెలిపారు. ఫిబ్రవరి నెలలో శుభోదయ సమైక్య సంఘం అధ్యక్షురాలు దేవిక అనే మహిళ ఐచర్ ట్రాక్టర్ తో పాటు కాజా కుట్టుమిషన్ చోరీకి గురైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా సిఐ సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు నిందితులు ముస్తాబాద్ కు చెందిన మహమ్మద్ షాదుల్లా, దావిరెడ్డిరెడ్డి నరేందర్ రెడ్డి, సిద్దిపేట చెందిన మహమ్మద్ సమీర్ లను అదుపులోకి తీసుకొని విచారించగా వారివద్ద ఒక ఐచర్ ట్రాక్టర్ కుట్టుమిషన్ స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనం కారు, మూడు సెల్ఫోన్లు సీజ్ చేసి ముగ్గురిని రిమాండ్ కు తరలించామని సిఐ మొగిలి తెలిపారు. వీరికి సహకరించిన రావుకుల గ్రామానికి చెందిన మల్లేశం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను జల్సాలకు అలవాటుపడి దొంగ తనాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ముస్తాబాద్ పోలీస్ సిబ్బందిని రూరల్ సిఐ అభినందించారు.
