ప్రాంతీయం

మాత, శిశు హాస్పిటల్ ను సందర్శించిన భట్టి విక్రమార్క

26 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మిస్తున్న మాతా,శిశు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం పక్కనే మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. ఆసుపత్రి ఎలా ఉండబోతోందో ఎమ్మెల్యే మంత్రులకు వివరించారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి సమీపాన కట్టవద్దని కోరినా గత పాలకులు వినిపించుకోలేదని భట్టి అన్నారు. పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐబీ స్తలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చామని అనుకున్నట్లే నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.

ఏడాదిలోపు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజాపాలనను తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంచిర్యాల లో ఐటీ పార్కు కు నిధులు కేటాయిస్తామని చెప్పారు. మంచిర్యాల ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈసమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొనగా, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించారు.

ప్రాణ హిత, చేవెళ్ల నీటి ప్రాజెక్టు నిర్మాణం చేసి సాగునీరు, తాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల వచ్చిన భట్టి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. టీఆరెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన ప్రాజెక్టును ప్రారంభిస్తామని భరోసాను ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంపై తనకు ఎంతో మమకారం ఉందని తన నియోజకవర్గ ము మధిర ఎంతో ఈ సెగ్మెంట్ అంతే ఇస్తామన్నారు. ప్రేమ్ సాగర్ రావుతో ఉన్న సాన్నిహిత్యంతో అభివృద్ధి కి తప్పకుండా సహకరిస్తామని అన్నారు. 765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని కొనియాడారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. సోమవారం హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి ,శ్రీధర్ బాబు సమక్షంలో మంత్రి పదవి తన కాకుండా పార్టీ ఫిరాయింపు వలస వాదులకు ఇస్తే ఉమ్మడి ప్రజల గొంతుకోసినట్లేనని అన్నారు. మంచిర్యాల పోరాటాలగడ్డ అన్యాయం జరిగితే ఉద్యమిస్తారని అన్నారు. బీజేపీ, బీఆరెస్ పార్టీల చుట్టూ తిరిగిన వారిని అందలం ఎక్కించవద్దని కోరారు. అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధమేనని స్పస్టం చేశారు.

అంబెడ్కర్ జయంతి పురస్కరించుకుని నూతనంగా ఏర్పాటు చేసిన అంబెడ్కర్ విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం మధ్యాహ్నం మంచిర్యాల వచ్చిన భట్టి సహచర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , ఖానాపూర్ ఎమ్మెల్యే హెడ్మా బొజ్జులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భట్టి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే, డీసీపీ భాస్కర్ అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు.

ఈకార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి కలెక్టర్ కార్యాలయం సమీపంలో హెలికాప్టర్ లో వచ్చిన భట్టి, శ్రీధర్ బాబులకు కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్