ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్
ఆదివాసీలరా సీపీఎం పార్టీని వీడండి
ములుగు జిల్లా,వాజేడు, సెప్టెంబర్ 20
వాజేడు మండలం పూసుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల మీద కన్నేసిన సిపిఎం పార్టీ నాయ కులు అయొక్క భూములను ఏటూరునాగారం వాజేడు వెంకటపురం మండలాలకు చెందిన గిరిజనేతరులకు కట్టపెట్టేందుకు సిద్ధమై ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 పిసా చట్టాలను నీరుగార్చే చర్యలకు పాలుపడటాన్ని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ తీవ్రంగా ఖండించారు.సిపిఎం పార్టీ నాయకులు గిరిజన చట్టాలను అమలు చేయాలి అంటూనే చట్టాలను తుంగలో తొక్కలని చూస్తున్న వక్ర బుద్దిని మార్చుకోవాలని మా బలం బలగం అని చూపెట్టుకోవటాని కి ప్రజలకు తప్పుడు మాటలు చెప్తూ భద్రాచలం నియోజకవ ర్గంలో ఓట్లు రాబట్టుకోవటానికి నీతిమాలిన కుటీల విధానాన్ని పాటించటం సరైన పద్ధతి కాదని అన్నారు.సీపీఎం పార్టీకి కార్యకర్తలుగా ఆదివాసీలు కావాలి కానీ ఆదివాసీల కోసం రాజ్యాంగ బద్దంగా పార్లమెంట్ లో రూపొందించిన చట్టాలు మాత్రం అడ్డువస్తున్నాయ అసలు సీపీఎం పార్టీ విధానం గిరిజన చట్టాల ఉల్లంఘన చేయటమేన దీనికి భేషరథుగా క్షేమాన చెప్పాలని పత్రిక ముకంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీపీఎం పార్టీ కుటిల విధానం బయటపడింది అని పార్టీలో ఉన్న ఆదివాసీల కు గిరిజన చట్టాల మీద ఏమా త్రం చిత్తశుద్ధి ఉన్న సీపీఎం పార్టీని విడిసి పెట్టాలని కోరారు.
సీపీఎం పార్టీ ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విఘాతం కలిగి స్తుంటే ఏమాత్రం పట్టించుకో కుండా స్థానిక తహశీల్దార్ చూస్తూ ఉండటం సరైన పద్దతి కాదని గిరిజన చట్టాల ఉల్లం ఘనకు పాల్పడిన సీపీఎం పార్టీ నాయకుల మీద పోలీస్ కేస్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారిమీద చర్యలు తీసుకొని పక్షాన ఆదివాసీ సంఘాల ప్రతిఘటన కూడా ప్రభుత్వ అధికారులు చవిచూ డక తప్పదని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ అన్నారు.