తెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం
– ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి
వీర్నపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు మండల స్థాయి నాయకుల సమావేశం సోమవారం రోజుననిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దయాకర్ రావు గారు మాట్లాడుతూ పార్టీ పురోగతి గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అలాగే కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు.ఇట్టి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు వీర్నపల్లి మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.మండల అధ్యక్షులుగా పెడతనపల్లి రాములు,ఉపాధ్యక్షులుగా నక్క చిన్న కాశిరామ్,గొల్లపల్లి రాజం,నీరటి స్వామి,ప్రధాన కార్యదర్శిగా అబ్బనవేని ఆశయ్య,కార్యనిర్వాక కార్యదర్శిలుగా పొత్తురి చిన్న రాజం,మామిండ్ల అంజయ్య, అధికార ప్రతినిధిగా సలేంద్రి లింబద్రి,కోశాధికారిగా అన్నారం జనార్ధన్,కార్యదర్శులుగా దాసరపు నారాయణ,అన్నారం శ్రీనివాస్ లను నియమించడం జరిగింది.వీరితోపాటు తెలుగు యువత మండల అధ్యక్షులుగా బరిగెల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బూర్ల రాజంను నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు చెట్కూరి నారాయణ గౌడ్ మాలోతు సూర్య నాయక్ TNSF నాయకులు మోతే రాజిరెడ్డి TNSF నాయకులు శ్యాగ ప్రశాంత్,నర్సింగం,అంజయ్య, రాజాం,దేవయ్య,తదితరులు పాల్గొన్నారు.




