ప్రాంతీయం

దేశంలో స్వేచ్ఛ సమానత్వం ప్రజలందరికీ సమానంగా దక్కాలి

163 Views

– *రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు*

దౌల్తాబాద్: దేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం ప్రజలందరికీ సమానంగా దక్కాలని సామాజిక సాంస్కృతిక విప్లవం ద్వారానే అది సాధ్యమవుతుందని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో అంటరానితనం అణిచివేత దోపిడీ సాంఘిక దురాచారాలపై పోరాడిన మహానీయుడు అన్నారు. మరుధర్మశాస్త్రం ప్రకారం నిచ్చెనమెట్ల వ్యవస్థ కొనసాగుతుండదని రాజ్యాంగం ద్వారా ఆ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి సమ సమాజం నిర్మించాలని లక్ష్యంతో కుల మత వర్గ భేదం లేకుండా భారత పౌరులందరికీ సమాన హక్కులు చట్టాలు కల్పించారు. అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకు పరిమితం చేశారని కార్మికులు కర్షకులు శ్రామికులు ఉద్యోగులు రైతులు ముఖ్యంగా మహిళలు సబ్బండ వర్గాల కోసం పోరాడిన ఘనత అంబేద్కర్ అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఎందుకు కూడా బిల్ ప్రవేశపెట్టి అది చట్ట రూపం దాల్చకపోతే మహిళలకే న్యాయం చేయలేని నేను దేశానికి ఏం న్యాయం చేయగలనని తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. పాలకులుగా సరైన నాయకులను ఎన్నుకోవడానికి వయోజనులైన భారత పౌరులందరికీ ఓటు హక్కును కల్పించింది అంబేద్కర్ అన్నారు.మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీని విధవరాలు అని అవమానించి భువనేశ్వర్ లోని పూరి జగన్నాథ్ ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటే నాకు ఆలయ ప్రవేశం చేసి అర్హత లేకపోయినా అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశాన్ని పరిపాలించే అధికారాన్ని కల్పించారని, మహిళలకు కూడా పురుషులతో పాటు సమానంగా రిజర్వేషన్ కల్పించింది అంబేద్కర్ అన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్, తన కుమారుడు శాంబాజీ మహారాజ్ లను అవమానపరిచి హత్య చేసింది బ్రాహ్మణీయ వ్యవస్థ అన్నారు. కాలం జ్ఞానం డబ్బులు సమాజ మార్పు కోసం తమ వంతు బాధ్యతగా అంబేద్కర్ ఆశయాలను పాటించాలన్నారు. జయంతి వర్ధంతులకు పూలమాలలు వేసి నివాళులర్పించడమే కాదు మహనీయుల బాటలో నడుస్తూ వారి ఆశయాలను ఆచరించినప్పుడే వారికి ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆరేపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఉల్లి హరిబాబు, ఉపాధ్యక్షులు ఇంద్ర లక్ష్మణ్, నారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాకీ మల్లేశం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పోమైన రాజు, అరె సంఘం నాయకులు కృష్ణయ్యగారి బాలరావు, మాజీ ఎంపిటిసి జానకిరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ దుర్గం జానకి గౌడ్, మాజీ సర్పంచ్ తుప్పతి యాదయ్య, మాజీ అధ్యక్షులు నర్సింలు, మండల నాయకులు దాతర్ పల్లి భాస్కర్, మాజీ అధ్యక్షులు పరశురాములు, తోకల రామకృష్ణ, ఉల్లి బిక్షపతి, మాల సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh