ప్రాంతీయం

మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు.

33 Views

మంచిర్యాల జిల్లా. మందమర్రి మండలం.

మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు.

మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. మండలానికి చెందిన మట్టి మాఫియా ఈ అక్రమ తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించి లక్షలు గడిస్తున్నారు. ఆపాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మందమర్రి మండల పరిధిలోని పొన్నారం గ్రామ శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపు తున్నారు. మండలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లకు మట్టి అవసరం ఏర్పడుతుండటంతో నల్ల రేగడి మట్టికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని అదనుగా తీసుకున్న కొందరు మట్టిని తరలించి లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తు భూ గర్భానికి క్షోభ మిగిలిస్తున్నారు. పట్టించు కోవలసిన రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై పలువురు సంబందిత రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చిన పోలీసులను పంపుతున్నామని చెప్పడం,భూమి లెవల్ చేస్తున్నారు,వాళ్ల పట్టా భూమిలో వారు తవ్వుకుంటున్నారు మీకెందుకని చెప్పి తప్పించుకోవడం సదరు అధికారులకు పరిపాటైందని పలువురు ఆరోపిస్తున్నారు.సదరు అధికారికి తెలిసిన పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వారు అన్నారు. భూమి లెవల్ కోసం మట్టిని అమ్ముకోవడం, వెంచర్లకు,ఫాంహౌస్‌లకు మట్టిని తరలించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా యథేచ్చగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు.సెలవు రోజుల్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా..అదును చూసి మట్టి మాఫియా సెలవు రోజుల్లోనే రెచ్చి పోతున్నారు. సెలవు రోజు కావడం అధికార యంత్రాంగం ఉండకపోవడంతో వారికి వరంగా మారుతోంది. నేరుగా పగలే మట్టి తవ్వకాలను చేపడుతున్నారు. సెలవు రోజైతే ఎవరూ ఉండరని అందుకే అదేరోజు మట్టి తవ్వకాలు జరపాలని సంబందిత అధికారులు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.మండలంలొ దాదాపు ఇదె పరిస్థితి పొన్నారం, గుడిపల్లి, అదిల్పెట్ యథేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ లో మట్టిని పరిమితికి మించి నింపడంతో రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఎక్కువ కాలం నిలవాల్సిన రోడ్లు ఇలాంటి వాళ్ల వల్ల త్వరగా పాడవుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం మరమత్తులు చేయడానికి అధికంగా ప్రజల సొమ్మును ఖర్చు చేయాలసి వస్తుంది.కొందరి అక్రమార్కుల స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేయడం మంచిదికాదని, ప్రకృతి పరంగా ఏర్పడిన మట్టిని తవ్వి అమ్మకాలు చేయడం ద్వారా పర్యావరణం దారుణంగా దెబ్బతింటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికై అటూ ఇసుక ఇటూ మట్టి తవ్వకాలపై ఉన్నతాధికారులు స్పందించి రెచ్చిపోతున్న ఇసుక,మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపి పర్యావరణాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్