ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి..
బాల సాహితీవేత్త కవి డాక్టర్ వాసర వేణి పరశురాములు
ష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ బోధన భాషగా పెట్టాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఇది మాతృ భాష తెలుగుకు గొడ్డలిపెట్టులాంటిదనీ, పి.జి స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం డిమాండ్ చేశారు.
ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో 13-04-2025న డా.వాసరవేణి పరశురాం మాట్లాడుతూ మాతృ భాష తెలుగును రక్షించే బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరిదనీ ,2020 జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందనీ ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా ప్రవేశపెట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం తెలుగు భాషా సంస్కృతులను కనుమరుగుచేయడమేనన్నారు. సంస్కృతం సబ్జెక్టు తీసుకున్న వారు హిందీ, ఇంగ్లీష్, తెలుగులో జవాబులు రాయవచ్చుననే సౌకర్యంతో తెలుగును పక్కనపెడుతారనీ తెలుగు ఉనికికే ప్రమాదం అన్నారు. ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో 99శాతం తెలుగు భాషా బోధన జరుగటంలేదనీ, ఈ ఉత్తర్వులతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు పూర్తిగా కనుమరుగై పోతుందన్నారు. అసలు మాతృభాషలోనే మానసిక వికాసం ఎక్కువగా జరుగుతుందనీ, ఒత్తిడి ఉండదన్నారు. జపాన్,సింగాపూర్, మొదలగు దేశాల్లో వారి మాతృభాషలోనే విద్యాబోధన చేస్తూ పరిశోధనలో, వృద్ధిలో ముందు ఉన్నారన్నారు. తెలంగాణలో ప్రభుత్వం పి.జి వరకు తెలుగును నిర్భంధంగా అమలుచేయాలని పరశురాం డిమాండ్ చేశారు.
