ప్రాంతీయం

తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు

85 Views

తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు

సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి 10 

 సిద్దిపేట జిల్లా గజ్వేల్ తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు ఇటీవల గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన నాగమణి అనారోగ్యంతో అస్వస్థకు గురై,గాంధీ హాస్పిటల్ లో మరణించింది, నాగమణి మరణించిన తర్వాత నాగమణి, భర్త కూడా కనబడుటలేదు ,నాగమణి, అంత్యక్రియలు కూడా గ్రామస్తుల ఆర్థిక సహాయంతో నిర్వహించారు.ప్రస్తుతం నాగమణి,అమ్మ, కళ సంరక్షణలో పిల్లలు ఉంటున్నారు.

వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు,

అందువలన, ఫెడరేషన్ పెద్దల సూచనమేరకు( టి పి టి ఎఫ్) గజ్వేల్ మండల శాఖ,వారి కుటుంబానికి ఆసరాగా ఉండుటకు విరాళాలు సేకరించడం జరిగింది.సేకరించిన మొత్తం 31500/-ఇందులో 30,000 పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి మిగిలిన 1500 లు,మొత్తాన్ని ఈ రోజు సాయంత్రం పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తుల సమక్షం లో వారికి అందజేయడం జరిగింది.మెసేజ్ చూసి ఆ పిల్లలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన వారికి మరియు నోట్ బుక్స్,బియ్యం , కిరాణా సరుకులు అందించిన అందరికీ,ఈ కార్యక్రమం లో పాల్గొన్న పాఠశాల,హెచ్ఎం. వేణుగోపాల్, సీనియర్ ఉపాధ్యాయులు ప్రభాకర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్తిరెడ్డి, ( టి పి టి ఎఫ్ )జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్ రాజులు, జోన్ కన్వీనర్ జల్లెల శ్రీనివాస్ యాదవ్,గజ్వెల్ మండల అధ్యక్షులు తాళ్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి గోక విద్యాసాగర్,( టీ పీ టీ ఎఫ్) నాయకులు, పంబాల ఎల్లయ్య, అక్కారం సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్