ముస్తాబాద్, ఏప్రిల్ 12 వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చిన ముస్తాబాద్ ఎన్నారై ఏళ్ల రాంరెడ్డి తండ్రిగారైన ఏళ్ల బాల్ రెడ్డి జ్ఞాపకార్థానుసారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కూల్ ఫ్రిడ్జ్ ను వితరణలో భాగంగా సంబంధిత ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతులమీదగా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ తమ తమ సమస్యలపై స్టేషన్ వచ్చిన ప్రజల సౌకర్యార్థం వేసవికాలంలో చలివేంద్రాలు, ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. అదేవిధంగా ఎన్నారై ఏళ్ల రామ్ రెడ్డి కూల్ ఫ్రిడ్జును అందించినట్లుగా మరెవరైనా దాతలుముందుకొచ్చి మండలంలో అసాంఘిక కార్యకలాపాలు, నేరాల కదలికలపట్ల నిఘా నేత్రాలకు దృశ్యాలు చిక్కేల ఉండునని ఇంకెవరైనా దాతలు ముందుకచ్చీ అందిస్తే మండలంలో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చునని ఎస్సై
తో పాటు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగు అంజాగౌడ్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, ఆరుట్ల మహేష్ రెడ్డి, కూర సంతోష్, కస్తూరి వెంకటరెడ్డి, స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




