ప్రాంతీయం

జూదం, క్రికెట్ బెట్టింగ్ ఒక వ్యసనం, ప్రాణాలకు ముప్పే.. ఎస్సై…

28 Views
 ముస్తాబాద్, ఏప్రిల్ 9 (24/7న్యూస్ ప్రతినిధి): క్రికెట్‌ బెట్టింగ్‌ ఒక విధ్వంసక వ్యాధి
బెట్టింగ్‌కు వ్యసనమైతే అదే మనల్ని నలుగురిలో నిలబెడుతుంది ఐపిఎల్‌ మ్యాచ్‌లు చూసి ఆనందించాలే తప్పా పెడదారిన పడకండి
ముస్తాబాద్‌ ఎస్‌ఐ సిహెచ్‌.గణేష్‌
ప్రజాస్ఫూర్తి, ముస్తాబాద్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఒక విధ్వంసక వ్యాధని, ఒక్కసారి బానిస అయితే కుటుంబం మొత్తం బాధ పడుతుందని ముస్తాబాద్‌ ఎస్‌ఐ సిహెచ్‌.గణేష్‌ హెచ్చరించారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రదానంగా యువతను ఉద్దేశించి బెట్టింగ్‌ల వల్ల కలిగే నష్టాలను, దాని ఫలితంగా దారి తీసే పరిస్థితులను ఒక ప్రకటనలో వివరించారు. బెట్టింగ్‌లు పాల్గొనేవారు మొదట సరదాగా కాస్తారని, మొదటి సారి, రెండవ సారి వస్తుందని, దీంతో వారిలో ఆశ మొదలవుతుందని తెలిపారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో బెట్టింగ్‌ కాస్తారని, ఈసారి వచ్చిన సొమ్ము, అదనపు వడ్డీతో సహా మొత్తం పోతుందని తెలిపారు. బెట్టింగ్‌కు ఒక్కసారి వ్యసన పడితే ఏదో ఒక రోజు అదే మనల్ని నలుగురిలో నిలబెడుతుందని హెచ్చరించారు. బెట్టింగ్‌లో లాస్‌ అయ్యి, పరువును కాపాడుకోలేక నలుగురిలో అవమానం పడి, సమాజంలో తలెత్తుకోలేక మృతి చెందడం, ఊరు వదలి వెళ్లిపోవడం, ఇలా అనేక కోణాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని యువత ఎలాంటి బెట్టింగ్‌లకు పాల్పడవద్దని సూచించారు. బెట్టింగ్‌ దందాపై పోలీసు నిఘా ఉందని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడుతున్న వారు నిఘాలో బయట పడితే ఖచ్చితంగా గేమింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఐపీఎల్‌ మ్యాచ్లు క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆట, కానీ బయట ఒక పెద్ద బిజినెస్‌, ఒక క్రికెట్‌ నిర్వహణకు లక్షలల్లో ఖర్చులు అయితే బెట్టింగులు మాత్రం కోట్లలో పడగలెత్తుతున్నారని, చిన్న చిన్న బెట్టింగులకు పాల్పడి మధ్య తరగతి కుటుంబాలు చిన్నా బిన్నం అయిపోతున్నాయని, కుటుంబాలే రోడ్డున పడుతున్నాయన్నారు. ఐపిఎల్‌ మ్యాచులను కేవలం చూసి ఆనందించాలే తప్పా, వేరే చెడు మార్గాల ద్వారా పెడ దారిన పడవద్దని ఆయ సూచించారు. బెట్టింగ్‌కి పాల్పడినట్టు తెలిసినా వెంటేనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్