Breaking News ప్రాంతీయం

సర్దార్ సర్వాయు పాపన్న గౌడ్ గొప్ప పోరాటయోధుడు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్.

83 Views

ఆదివారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఓక ప్రతీక. నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను కావాలని ప్రజాస్వామ్యక స్ఫూర్తితో చేసిన పోరాటం గొప్ప విషయం. విశ్వ కీర్తి పొందిన ఆయన గొప్పదనాన్ని స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారి జగత్ కూమార్ రెడ్డి, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7