ప్రాంతీయం

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మహిళా మృతి…

121 Views
  ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్:14;  రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం చెందిన ఓ మహిళ గొర్లను కాస్తుండగా ఉరుములతో కూడిన పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు, తాసిల్దార్ తెలిపారు.
మండలంలో మద్దిమల్ల గ్రామానికి చెందిన కడావత్ లలిత (35) అనే మహిళ గొర్రెలను కాపేందుకు తన పొలం వైపు వెళ్లగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతూ పిడుగు పడింది ఆ పిడుగుపాటుకు మహిళ కింద పడిపోగా స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఇక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలపడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను మిన్నంటాయి. సమాచారం అందుకున్న స్థానిక తాసిల్దార్ మొహమ్మద్ తపస్సు హుస్సేన్ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. మృతురాలికిభర్త శంకర్ ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7