ప్రాంతీయం

లక్షేట్టిపేటలో అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర

50 Views

మంచిర్యాల జిల్లా.

అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర.

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్టిపెట్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి అంగడి బజార్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ దీక్ష స్వాములు మరియు హనుమాన్ భక్తులు ఘనంగా హనుమాన్ శోభ యాత్ర చేపట్టడం జరిగింది.

ఈ హనుమాన్ శోభ యాత్రలో రఘునాథ్ వెరబెల్లి  మరియు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర చేపట్టడం జరిగింది. శోభ యాత్ర ముగిసిన అనంతరం అంగడి బజార్ హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది అనంతరం సామూహిక హనుమాన్ భీక్ష స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ ఈ శోభ యాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు మరియు భక్తులు పాల్గొని హిందువుల ఐక్యత చాటడం గొప్ప పరిణామం అని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు తమ వంతు కృషి చేయాలని అన్నారు. హనుమాన్ దీక్ష స్వాములు పేద ఎత్తున ఈ శోభ యాత్రలో పాల్గొని విజయవంత చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి కర్ణకాంటి రవీందర్, గాజుల ముఖేష్ గౌడ్, వీరమల్ల హరి గోపాల్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గుండా ప్రభాకర్, రమేష్ జైన్, నరేష్ జైన్, వేముల మధు, బొప్పు కిషన్, సామ వెంకట రమణ, తగరపు గంగన్న, సిరిమల్ల వెంకటేష్, ఎంబడి వెంకటేష్ , సమరసింహా, సిద్దార్థ, హనుమాన్ స్వాములు, భక్తులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్