మంచిర్యాల జిల్లా.
బిజెపి ఆధ్వర్యంలో చలో బస్తి కార్యక్రమం.
బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సీసీసీ టౌన్ షిప్ లో బస్తీ ఛలో/ గావ్ ఛలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్ మరియు పులగం తిరుపతి పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 198 వజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించి 243 బూత్ సమావేశం నిర్వహించి అనంతరం డంప్ యార్డ్ ను సందర్శించడం జరిగింది. ఈ డంపు యాడ్ వల్ల స్థానిక ప్రజలను ఇబ్బంది పడుతున్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ యాడ్ వల్ల ఎంతోమంది ప్రజలు శ్వాసకోస వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. నస్పూర్ గ్రామపంచాయతీ పేరుకు మాత్రమే నగరపాలక సంస్థగా మారింది, కానీ అభివృద్ధి శూన్యం అని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ సీనియర్, రాష్ట్ర,జిల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శిలు , వివిధ మోర్చా నాయకులు, బిజెపి అభిమానులు మరియు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
