ప్రాంతీయం

యూనివర్సిటీ భూములు అమ్మొద్దు జిల్లా అధ్యక్షులు…

59 Views
ముస్తాబాద్, మార్చి 31 (24/7న్యూస్ ప్రతినిధి); హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సి యు) భూములు అమ్మకుండా విద్యార్థులు చేస్తున్న పోరాటం ప్రభుత్వ వైఖరి సరికాదు, విద్యార్థులను అక్రమంగా ఇష్టానుసారంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు.. భూములు అమ్మక నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేస్తున్న తరుణంలో విద్యార్థులపై నాటి చార్జీలు చేస్తూ అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదని ఒకవైపు ప్రజాపాలన అంటూ ప్రశ్నిస్తున్న విద్యార్థుల గొంతు నొక్కేయడం సరికాదు కాంగ్రెస్ ప్రభుత్వం  విరమించుకోవాలి ఎంతోమంది విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అలాంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రవేట్ కంపెనీలకు అమ్మక నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఆలోచన విధానాన్ని వెనుకకు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థుల అంతా మమేకమై రాష్ట్రాల జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్