Breaking News ప్రాంతీయం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ శ్రీనివాస్ కుటుంబానికి అండగా గోల్డ్ అప్రైజర్ రీజనల్ యూనియన్

348 Views

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి శ్రీనివాస్ చారి గత మూడు నెలల క్రితం గుండెపోటుతో అకాల మరణం చెందగా వారి కుటుంబ దీనస్థితిని చూసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జగిత్యాల రీజనల్ గోల్డ్ అప్రైజర్ యూనియన్ తరపున వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ భార్య ఇందూరి లక్ష్మి కుమారుడు వంశీలకు ఆర్థిక సహాయం 25వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు నెలకు సరిపడా 25 కిలోల బియ్యాన్ని శనివారం రోజున జగిత్యాల రీజనల్ అప్రైజర్ మిత్రులతో కలిసి బండలింగాపూర్ గ్రామంలో మృతుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది గోల్డ్ అప్రైజర్ల యూనియన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ సభ్యులు మాట్లాడుతూ ఇందూరి శ్రీనివాస్ కుటుంబాన్ని చూస్తే ఇలాంటి స్థితి పగవానికి కూడా రాకూడదని చేతి కందిన కొడుకు మంచంలో చలనం లేని జీవిగా పడి ఉండడం అన్నీ తానై కన్నతల్లి మంచంలో ఉన్న కొడుకు మలమూత్రాలతో సహా ఎత్తిపోయడానినీ చూస్తే చాలా బాధాకరంగా ఉందని 8 సంవత్సరాల నుండి మంచాన పడి నడుము కింది భాగం నుండి కాళ్ల వరకు ఎలాంటి చలనం లేని చచ్చు బడి పోయిన పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఇప్పటివరకు గ్రామ సర్పంచ్ కానీ ఉన్నత అధికారులు పట్టించుకోని శ్రీనివాస్ కుమారునికి ఇందూరి వంశీకి వికలాంగుల పెన్షన్ ఇప్పియ్యాలని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఎవరికైనా బాధగా అనిపించి ఇప్పటికే ఇప్పిచ్చేవారని ఇప్పటికైనా గ్రామ పాలకవర్గం మండల స్థాయి నాయకుల వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లి వంశీకి వికలాంగుల పెన్షన్ ఇప్పించే లాగా చేయాలని బండలింగాపూర్ లో ఉన్న విశ్వబ్రాహ్మణులకు కోరారు మీకు ఏదైనా సాయం కావాలన్నా మేం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జగిత్యాల ఒరిజినల్ అధ్యక్షుడు శ్రీరామోజు దేవరాజ్ చారి, రాచర్ల గొల్లపల్లి బ్రాంచ్, ఉపాధ్యక్షులు కిరణ్ చారి , జగిత్యాల గొల్లపల్లి బ్రాంచ్ , శ్రీపాద లక్ష్మీ నరసయ్య చారి, ఇబ్రహీంపట్నం బ్రాంచ్, శ్రీరాముల సాయికుమార్ చారి, కథలాపూర్ బ్రాంచ్, కిరణ్ కుమార్ చారి, నారోజు రాజు చారి, గూడెం బ్రాంచ్, సిహెచ్ రాజేశం చారి, సిరిసిల్ల బ్రాంచ్, ప్రసాద్ చారి, సురేష్ చారి, ముప్పిడి నరేష్ చారి, బండలింగాపూర్ బ్రాంచ్, నాంపల్లి ప్రవీణ్ చారి, మెట్పల్లి బ్రాంచ్, మరి కొంతమంది అప్రైజర్లు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7