ప్రాంతీయం

మంచిర్యాలలో ఉగాది పండుగ వేడుకలు

46 Views

మంచిర్యాల జిల్లా.

ఉగాది పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం లో ఉగాది పండుగ వేడుకలు.

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, DFO ఆశిష్ సింగ్ , పోలీస్ అధికారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, దేవి దేవతల కరుణాకటాక్షాలు అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షింస్తు పూజలు చేయడం జరిగింది.

అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found