గాయత్రి బ్యాంకులో ప్రమాద బీమా చెక్కు అందజేత కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన అనుమాసుల రవీందర్ రెడ్డి ప్రమాదవశత్తూ మృతి చెందగా అతని భార్య అనుమాసుల లతకు హుస్నాబాద్ గాయత్రి బ్యాంకు యందు గురువారం హుస్నాబాద్ సిఐ ఈ. కిరణ్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సిఐ కిరణ్ గారు బ్యాంకు సిబ్బంది గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం రూ.600 లతో ఖాతా ప్రారంభించినట్టయితే ఒక లక్ష రూపాయల ప్రమాద బీమా తో పాటు అవసరరీత్య లోన్ సౌకర్యం కూడా పొందవచ్చు అన్నారు. వ్యవసాయ రుణాలు ఎకరానికి రూపాయలు 1,50,000 తో పాటు అతి తక్కువ వడ్డీ గోల్డ్ లోన్ పొందవచ్చు అన్నారు. అలాగే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు మైక్రో ఎటిఎం, ఏ ఈ పి ఎస్,యూపీఐ ,మొబైల్ బ్యాంకింగ్ సేవలు వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ యన్.రామకృష్ణ మరియు కిషన్, జీవన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
