మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య సూచించారు. శనివారం నిర్వహించిన ఎంఈఓ లు, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు మరియు రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో యాదయ్య పాల్గొన్నారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని మరియు పరీక్ష సంబంధించి సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
