ప్రాంతీయం

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

39 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలో ఈనెల 05 తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి  లోటుపాట్ల లేకుండా పరీక్షలు నిర్వహించాలని మరియు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించబడుతుందని , పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఈ సమావేశంలో తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్