ప్రాంతీయం

మంచిర్యాలలో బీసీ జేఏసీ జిల్లా సమావేశం

75 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలలో బీసీ జిల్లా జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు.

నేడు మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పేరం అలేఖ్య నటేశ్వర్ న్యాయవాద దంపతుల స్వగృహంలో బిసి జేఏసీ జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బిసి నాయకులు వడ్డేపల్లి మనోహర్, చిలువేరు సదానందం, ఆవిడపు గణేష్ సర్పంచ్, మల్లేష్, అడ్వకేట్ నటేశ్వర్, శ్రీనివాస్, లతీఫ్ మరియు మహిళా నాయకులు మరియు సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలు పేరం అలేఖ్య, ఆడెపు శ్యామల మరియు ముత్యాల సత్యవతి, కౌన్సిలర్ బండి పద్మ, కట్ట మంగ, స్వప్న మరియు తదితరులు పాల్గొన్నారు.

బీసీ జనాభా ఎంతో వారి వాటా అంత ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం జరగాలని సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో బీసీలు అన్ని రంగాల్లో రాణించి మన గొంతుక గల్లి నుంచి ఢిల్లీ వరకు వినపడే విధంగా మనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలని చర్చించడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్