హాలియా మున్సిపాలిటీ…3 వార్డు (యస్.సి) కాలనీ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ యూత్ సభ్యులు ఆహ్వానం మేరకు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడిని దర్శించుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్స్థనిక పట్టణ నాయకులు, వార్డు యువకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేని
ఘనంగా సత్కరించారు. తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో..NCM ఫౌండేషన్ చైర్మన్ నల్లగొండ ఆంజనేయులు, హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, పాక్స్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ మూడో వార్డు అధ్యక్షులు రావులపాటి ఎల్లయ్య, బుర్రి మొగులయ్య, 9వ వార్డు ఇన్చార్జి మాతంగి కాశయ్య, మార్కెట్ డైరెక్టర్ సురభి రాంబాబు, డైరెక్టర్ పొదిల శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు సైదాచారి, పోట్టేపాక కళ్యాణ్, పల్లెటి గోవిందు, పోలే చంద్రయ్య, మరియు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మద్దిమడుగు మార్క్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




