రామగుండం పోలీస్ కమిషనరేట్
15.904 కేజీల గంజాయి పట్టుకొన్న రామగుండం పోలీసులు.
దాని విలువ రూ. 7,95,200/-
హైదరాబాద్ లోని శామీర్ పేటకు చెందిన ఓ వ్యక్తి వైజాగ్ నుండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వస్తున్నాడానే రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., గోదావరిఖని ఏసీపీ రమేశ్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారి ఆదేశాల మేరకు రామగుండం ఎస్ఐ సంధ్య రాణి సిబ్బంది తో కలిసి రైల్వే స్టేషన్ ప్రాంతం లో పెట్రోలింగ్ చేసే క్రమంలో రామగుండం రైల్వేస్టేషన్ లో పోలీసులను చూసి అనుమానస్పదంగా ఓక వ్యక్తి లగేజీ బ్యాగులతో నడుచుకుంటూ వేగంగా వెళుతుండడంతో అనుమానం వచ్చి బ్యాగులను సోదా చేయడంతో అందులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా తను శామీర్ పేట మండల పరిధిలోని అతిరాజ్ పల్లి గ్రామానికి చెందిన తీగుళ్ల రామకృష్ణ అని రెండు లగేజీ బ్యాగులలో గంజాయి తో ఎవరికీ అనుమానం రాకుండా వైజాగ్ నుండి ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో దిగాను అని తెలపడం జరిగింది. రెండు బ్యాగులలో 15.904 కేజీల గంజాయి, దాని విలువ రూ. 7,95,200/-గా గుర్తించడం జరిగింది.
ఎస్ ఐ రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ కి సమాచారం అందించి గంజాయిని సీజ్ చేసి తీగుళ్ల రామకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. కాగా గంజాయి రవాణా, విక్రయాలతో పాటు ఎంతమంది సరఫరా చేస్తున్నారనే విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈ టాస్క్ లో పోలీసు సిబ్బంది సంపత్, నరేష్, బాణయ్య లను సీపీ, ఏసీపీ,సీఐ,లు అభినందించారని ఎస్సై సంధ్యారాణి తెలిపారు.
