పోచమ్మ కు చలి బోనాలు……..
చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ
– పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు
ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో మహిళలు, చలి బోనాలతో వేకువజామునే శ్రీ పోచమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయాన్ని, అమ్మవారిని అందంగా అలంకరించారు. దూప, దీపం సమర్పించి, కల్లు సాక పెట్టి, చలిబోనం స్వీకరించి, మమ్మల్ని, మాగ్రామాన్ని పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లేల, చల్లగా చూడమ్మా అంటూ, భక్తి శ్రద్ధలతో పూజలు చేసారు. ఆలయ ఆవరణలో, చలి బోనం నైవేద్యాలు ఆరగించి, పిల్లాపాపలతో సరదాగా గడిపారు.
