ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి- రఘునాథ్ వెరబెల్లి

64 Views

మంచిర్యాల జిల్లా.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి- రఘునాథ్ వెరబెల్లి .

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణం గౌతమి నగర్, రామ్ నగర్ మరియు గర్మిళ్ళ లో పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్రీ అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈ నెల 27 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి గారికి పట్టభద్రుల ఓటర్లు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని అన్నారు. గత అయిదు సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేసిందని తెలిపారు. గత BRS ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మరియు నిరుద్యోగం భృతి ఇవ్వాక యువతను మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ బృతి ఇస్తామని యువ వికాసం పేరుతో మోసం చేసింది అని అన్నారు. యువతను అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే నిరుద్యోగ సమస్యల పై మండలి లో తమ గళాన్ని వినిపిస్తారని తెలిపారు. కాబట్టి 27 న జరిగే ఎన్నికల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటు ను బీజేపీ పార్టీకి వేయాలని కోరారు.

ఈ కార్యక్రమలో పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్, దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, అవిడపు రాజా బాబు, బింగి ప్రవీణ్,కంకణాల సతీష్, రెడ్డిమల్ల అశోక్, చక్రి మరియు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్