ప్రాంతీయం

డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని నిరసన…

92 Views

ముస్తాబాద్, జనవరి 4 (24/7 న్యూస్): ముస్తాబాద్ మండలంలో చింతోజు బాలయ్య గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సుదీర్ఘ పోరాటంలో భాగంగా మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఇంటర్ డిగ్రీ కాలేజ్ ముందర కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో నిరసన తెలియజేచేశారు. ఈ సందర్భంగా చింతోజు బాలయ్య మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని అనేక మార్లు నిరసనలు తెలిపినాము. నాటి పాలనలో 2016 2017 సంవత్సరంలో డిగ్రీ కలశాల మంజూరి ప్రకటనని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలంలో డిగ్రీ కళాశాలకు అనుకూల ప్రదేశం సౌకర్యం ఉన్నది ఇక్కడి నుండి అనేకమంది విద్యార్థులు ఒక్కొక్కసారి బస్సుల కొరకు నిరీక్షణ కాళ్లు తిమ్మిర్రెక్కి ఇంటికి తిరిగి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఓవైపు బస్సులు సమయానికి అందక ఇతర వాహనాల ద్వారా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని తదితర వాహనాల ద్వారా వేరే ప్రదేశాలకి డిగ్రీ విద్యార్థులు ఇన్ని సమస్యలు ఎదుర్కొర్కొంటు కళాశాలకు వెళ్తున్నారు. ఇంత తీవ్రతకంగా ఉండగా ప్రభుత్వానికి పట్టదా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే డిగ్రీ కళాశాల మంజూరు చేసి విద్యార్థిని విద్యార్థులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్