ప్రాంతీయం

ఘనంగా రిజర్వేషన్స్ డే

84 Views

ఘనంగా సాహు మహారాజ్ రిజర్వేషన్స్ డే

సిద్దిపేట జిల్లా జూలై 26

బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు కటికాల ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో రిజర్వేషన్ డే ను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.

భారతదేశ చరిత్రలో బహుజనులను విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా పాలనపరంగా మహాత్మ జ్యోతిబాఫూలే, ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసిన మహానీయుడు రాజర్షి ఛత్రపతి సాహుమహారాజ్‌. 1874లో జన్మించిన యశ్వంతరావు ఘాట్గేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్‌గా ప్రసిద్ది చెందాడు ఘాట్గేలు మహారాష్ట్రలో వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కి చెంది, వ్యవసాయం చేసుకొని జీవించే కున్భీ కాపు కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్‌ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణి ఆనందబాయి తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంత్‌రావు ఘాట్గేకి ముద్దుగా ‘సాహు’ అని పేరు పెట్టుకుంది. మూడేండ్లకే తల్లిని కోల్పోయిన సాహు 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏండ్లకే తల్లిదండ్రులిద్దరూ లేని వాడైనాడు. దీంతో సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగింది. అందుకే ఆయన ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వెనుకబడిన కులాలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించడానికి 40 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన మహనీయులు సాహు మహారాజ్ సమాన అవకాశాలు కల్పించారు.ఎవరి జనాభా ఎంతో వారికి వాటా అంతా అనే సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తూ దేశానికి ఆదర్శపంగా నిలిచారు అని సందర్భంగా ఆయన తెలియజే.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శులు లింగంపల్లి యాదగిరి, జక్కుల వెంకన్న, డేగల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల్ మల్లేశం ముదిరాజ్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ కొండనోళ్ల నరేష్, జిల్లా ఈసీ మెంబర్ ఖాతా మహేష్, సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు రమేష్, గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు కానుగుల రమణాకర్, నవీన్, కనకప్రసాద్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్