మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఈరోజు వసంత పంచమి పర్వదినాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ ఆలయ అర్చకుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పిల్లలకు అక్షరాభ్యాసం వసంత పంచమి రోజున చేయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటు పాటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. విశ్వనాథ ఆలయంలో ఉదయం నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
