ముస్తాబాద్/అక్టోబర్/10; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం కొత్తబస్టాండ్ లో కనీస వసతులు కరువు… సమస్యలతో కేరాఫ్ అడ్రస్ గా మారింది అధికారుల నిర్లక్ష్యం వలన బస్టాండ్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ పేరుకుతగ్గ వసతులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు తాగుదామన్న నీళ్లు దొరకని పరిస్థితి నామమాత్రంగా ప్రధానరహదారి ప్రక్కన ఒక్క కులాయున్న అందులో నుంచి నీళ్లు ఎప్పుడు దర్శనమిస్తాయో తెలియదు మరుగుదొడ్లు మూత్రశాలలు ఏళ్లు గడిచిన నిర్మాణంలోనే దర్శనమిస్తున్నాయి. పలు మండలాలనుండి ముస్తాబాద్ పట్టణానికి వివిధ పనులపై రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈపట్టణం ఒకవైపు వ్యాపార కేంద్రంగా సాగిస్తూ ఉంటే ఓవైపు కనీస సౌకర్యాలు కరువైనాయి. బస్సులు రాకపోకలు సాగించాలంటే ఓసాహసం చేయాల్సివస్తుందని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు. బస్టాండ్ లొ ప్రయాణికులకు మూత్రశాలులేక నానా ఇబ్బందులు పడుతూ చుట్టుపక్కల మూత్రవిసర్జన చేస్తున్నారు. ఓపక్క దోమలు,దుర్వాసన వెదజల్లుతుంది. ఓపక్క చెట్లు కూలీ కుప్పలుగా పడిఉండి విషపూరితమైన పాములు ఎలుకలు క్రీమికీటకాలు వస్తుంటాయని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్ లో బస్సులు రాకపోకల పట్టిక లేదు బస్టాండ్లో రాత్రి అయితే అంతే ఓఇంచార్జి కూడా కరువయ్యారు అసలు పేరులేని బస్టాండ్ కు కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.




