ప్రాంతీయం

గ్రామపంచాయతీ డ్రైవర్ బాబు మృతి

138 Views

ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది అయిన డ్రైవర్ రేసు బాబు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు 33 గత రెండు రోజుల క్రితం ఛాతిలో నొప్పి వస్తుందని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా వైద్యులు పరీక్షించి కరీంనగర్ లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించగా కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం చలిమెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఐదు గంటల వరకు తన ఆరోగ్య పరిస్థితి చెప్తామని కుటుంబ సభ్యులకు వివరించారని చికిత్స పొందుతూ రాత్రి పదిన్నర గంటలకు మృత్యువాత పడ్డాడు. అకాల మరణం పొందడంతో కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రంలో మునిగిపోగా ఎల్లారెడ్డిపేటలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామపంచాయతీ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సర్పంచ్ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రభుత్వపరంగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామపంచాయతీ సిబ్బంది కోరుచున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *