ముస్తాబాద్, జనవరి 31 కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్న రెడ్డి సామాజిక వర్గం.. ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతన అధ్యక్షుడు కస్తూరి పద్మారెడ్డితో పాటు మాజి అధ్యక్షుడు చల్లా దేవరెడ్డి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తీన్మార్ మల్లన్న మాటలను ఖండిస్తూ ఆ వాక్యాలను వెను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. లేనియెడల నాలిక చీరేస్తామంటూ వ్యాఖనించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులాల మధ్య కుంపట్లు, మతాల మంటలు, ప్రాంతాల చిచ్చులు పెడుతున్న మల్లన్న లాంటి నాయకులు రాజకీయాల్లో ఉండటం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి వారిని కాంగ్రెస్ వెంటనే బహిష్కరించాలని, అంతేకాకుండా ఎమ్మెల్సీగా కూడా బర్తరఫ్ చేయాలని కోరారు. ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న ఇలాంటి కామెంట్స్ చేసి భవిష్యత్తు తరాలకు ఏం మేసేజ్ ఇస్తున్నారని బంధనకల్ రెడ్డి సంఘ నాయకులు మండిపడ్దారు. తీన్మార్ మల్లన్న ప్రతి మీటింగ్ లో రెడ్లపై నీచమైన కామెంట్స్ చేస్తున్నారని మరోసారి ఇలా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కస్తూరి వెంకటరెడ్డి, నల్ల శ్రీనివాస్ రెడ్డి, కస్తూరి గాల్ రెడ్డి, కస్తూరి మధురెడ్డి, కస్తూరి శ్రీనివాసరెడ్డి, కస్తూరి రవిరెడ్డి, కస్తూరి నర్సారెడ్డి, కరెడ్ల చంద్రంరెడ్డి తదితర రెడ్డి సంఘంలో నాయకులు పాల్గొన్నారు.
