డి ఈ ఓ ఆఫీస్ ని ముట్టడించిన ఏబీవీపీ నాయకులు
సిద్దిపేట జిల్లా జూన్ 28
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ ) సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు (డి ఈ ఓ)ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిద్దిపేట జిల్లా కన్వీనర్ బీరకాయల వివేక్ వర్ధన్ మాట్లాడుతూ “తెలంగాణ వచ్చి పది ఏళ్లు గడిచిన కాలంలో పార్టీలు మారినాయి గాని విద్యార్థులు బతుకులు మారలేదు పేద విద్యార్థులకు కార్పొరేట్ బడిలోకి పోలేక గవర్నమెంట్ బడికి వెళ్తే కనీసం ఉండాల్సిన మౌలిక వసతులు కూడా ఉండడం లేదు. పిల్లలు ఉండే బడిలో పందులు కుక్కలు వస్తున్నాయి తినే ఆహారం కూడా విషంగా మారి ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు. ప్రభుత్వ బడిలో ఇలా ఉన్నాయని ప్రైవేట్ బడికి వెళ్తే బుక్స్, ఫీజులు ,యూనిఫాం అని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిరుపేదం కుటుంబం విద్యార్థులు ఎలా చదువుతుంటారు. ప్రభుత్వ బడికి వెళితే ఆరోగ్యం పాడైతుంది. ప్రైవేట్ బడికి వెళ్తే ఇష్టమున్నట్టు దోచుకుంటున్నారు. ఇలా ప్రైవేట్ పాఠశాలలో యూనిఫామ్ మరియు బుక్స్ వాళ్లకి ఇష్టం ఉన్న రేట్లకు అమ్ముతున్నారని స్థానిక డీ ఈ ఓ.కి తెలియజేస్తే స్థానిక డీఈవో ఒక చేతితో తాళం వేసినట్టు వేసి ఇంకో చేయితో లంచం తీసుకొని వదిలేస్తున్నారు
స్థానిక డీఈఓ కి నెలకి ఇచ్చే గవర్నమెంట్ జీతం కంటే కార్పొరేట్ విద్యాసంస్థల లంచం ఎక్కువ వస్తుంది ఇలాంటి డీఈవోలు ఇలాంటి గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు విద్యార్థులకి న్యాయం జరగద ఇలాగే మీ మీయొక్క నిరంకుశ పాలన కొనసాగిస్తే ఏబీవీపీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని హెచ్చరిస్తున్నాం.
గత ప్రభుత్వం లో ఇలాగే సోమరిబోతు పాలన కొనసాగిస్తే కధనబేరి అనే కార్యక్రమం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు న్యాయం దొరకకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బొంద పెట్టడానికి ఏబీవీపీ ముందుంటుంది అని తెలియజేయడం జరిగింది.అనంతరం అడిషనల్ డిఈఓ వెంకటరెడ్డి మెమొరాండం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య,పవన్, నగర కార్యదర్శి పర్షరాం,రాజేష్,రాజు, మహేందర్ , చందు , నవీన్, ఫనిందర్ ,అభినయ్, సంతోష్, భాను ,రాకేష్,సంజయ్,శంకర్,ప్రణయ్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది





