సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 20
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, బుద్ధ సత్యపాల్ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ధార్మిక పరిషత్ రాష్ట్ర అద్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో సముద్రాల హరినాథ్ కు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అంజయ్య స్వామి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ వ్యాపారంలో రాజకీయాల్లో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రాల హరినాథ్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నారు, అనంతరం సముద్రాల హరినాథ్ మాట్లాడుతూ, వంగపల్లి అంజయ్య స్వామి సేవలు అభినందనీయమని, ప్రజలను భక్తి మార్గం వైపు పయనించే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహిస్తూ ప్రతి మంగళవారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో భక్తులకు అన్నదానం అందజేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు,





