ప్రాంతీయం

అన్నదానం మహాదానం

33 Views

అన్నదానం మహాదానం

 – ఎన్ సీ రాజమౌళి 

సిద్దిపేట్ జిల్లా జనవరి, 29,

అన్నదాన మహాదానమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి అన్నారు.  సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, మాట్లాడుతూ అన్నదానం మహాదానమని గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, కీర్తిశేషులు నేతి అనసూయ జ్ఞాపకార్థం వారి కుమారులు నేతి సత్యనారాయణ,నేతి లక్ష్మి నర్సయ్య,నేతి శ్రీనివాస్,నేతి వేణుగోపాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధి బిక్షపతి, రీజియన్ చైర్మన్ గోలి సంతోష్, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్, కొమురవెల్లి సుధాకర్, సూర ఆంజనేయులు,లయన్ మల్లేశం గౌడ్, రుక్మయ్య, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్