ప్రాంతీయం

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

30 Views

 

 

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

సిద్దిపేట జిల్లా జనవరి 29

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా జిల్లా ట్రెజరి కార్యాలయంలో డిటివో ని కలిసి పెండింగులో ఉన్న మెడికల్, జిపిఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్,ఫైనల్ పేమెంట్,సరెండర్,ఇతర బకాయిలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్ష రూపాయలు పై బడిన బిల్లులు విడుదల చేయకపోవడం వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వెంటనే ఆయా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం డైరీ ని డిటివో కి అందజేశారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్