ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజాపక్షం జాతీయ దినపత్రిక 2025 కాలమానిని ఆవిష్కరించారు. గురువారం కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ప్రజాపక్షం దినపత్రిక ప్రజల పక్షాన ఉంటుందని కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి కొండ్లెపు జగదీశ్వర్ ఆధ్వర్యంలో దినపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందర్ల శ్రీనివాస్ గౌడ్, గిరిధర్ రెడ్డి, గోశిక కృష్ణ హరి, తదితరులున్నారు.
