రామకోటి రామరాజు చరితార్థులు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
అయన రామభక్తి అమోఘం అని కొనియాడారు.
చదువు కోట్లాది రామ నామాలు లిఖింపజేసిన ఘనత రామకోటిదే
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జనవరి 26
భద్రాచల దేవస్థానమే అపర రామదాసుగా కీర్తించి సన్మానించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజును శనివారం నాడు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ రామ నామమే ప్రాణమని నమ్మి నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికాలాంటి ప్రాంతాలలో సైతం రామ నామాలను లిఖింపజెపిస్తూ వారికీ ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్తున్న రామకోటి రామరాజు జీవితం ధన్యం అని కొనియాడారు.చదువు రాని వారితో సైతం కోట్లాది సంఖ్యలో రామ నామాలను లిఖింప జేసిన ఘనత రామకోటి రామరాజుదే అన్నారు. ఆయన గత 25సంవత్సరాలనుండి చేస్తున్న నిర్వీరామ సేవలు అమోగం అని ప్రత్యేక సన్మాన ప్రతం అందజేసి ఘనంగా సన్మానించారు.
