ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 1 బిసి ఉద్యమ నేత గత 27 సంవత్సరాల నుండి బీసీల కోసం ఉద్యమిస్తున్న బిసీ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు పుట్టిన రోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలోనీ పేషెంట్స్ కి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బీసీల గురించి ఉద్యమిస్తూ రెండు సార్లు జైలు జీవితం గడిపిన ఉద్యమ నేత
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతున్ని వేడుకుంటున్నట్టు పేర్కొన్నారు. బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్,మండల అధ్యక్షులు మట్టే నరేష్, పట్టణ అధ్యక్షులు రుద్రవీణ సుజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




