నేరాలు

చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందుతులకు జైలుశిక్ష,…

111 Views
ముస్తాబాద్ జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): వృద్దురాలిని దారి అడుగుతు ఆమె మేడలోని బంగారు గొలుసు దొంగలించిన ఇద్దరు నిందుతులకు సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ 13 నెలల జైలు శిక్షతో పాటు రెండు వందలరూపాయల జరిమానా విధించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు.
 వివరాల ప్రకారం ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బోప్ప మల్లవ్వ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన శివ, కూరపాటి నరేష్ లు రామలక్ష్మణపల్లెకు వెళ్ళే దారి  అడుగుతూ,బోప్ప మల్లవ్వ మెడలోని బంగారు పుస్తెలతాడు తెంపుకొని పోయారని బొప్ప దేవరాజు పిర్యాదు మేరకు,కేసు నమోదు చేసి అప్పటి ఎస్సై శేఖర్ రెడ్డి ఇద్దరు  నిందుతులపై కేసు నమోదుచేసి రిమాండ్ కి తరలించి చార్జిషీట్ దాఖలు చేయగా సి ఎం ఎస్ ఎస్. ఐ. రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ అడేపు దేవేందర్,  ఏడుగురు సాక్షులను ప్రవేశపెట్టగ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ ఇద్దరు నిందుతులకు13నెలల జైలుశిక్ష, 200 రూపాయల జరిమాన విధించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ చిందం గణేష్ తెలిపారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్